బహుజనుల బ్రతుకులు మారేది బీఎస్పీ తోనే
ధర్మపురి నియోజకవర్గం – నక్క విజయ్ కుమార్
గొల్లపల్లి. సెప్టెంబర్. 08 (కామన్ మ్యాన్ న్యూస్ గురు):
జగిత్యాల : జిల్లాలోని ధర్మపురి నియోజకవర్గ వ్యాప్తంగా బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న గడప గడపకు గజరాజు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం గొల్లపల్లి మండలంలోని దట్నూర్ గ్రామంలో నియోజకవర్గ ఇంచార్జి నక్క విజయ్ కుమార్, పర్యటించిగా ముందుగా ఆయనకు మహిళలు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు.డప్పు చప్పుళ్లతో ర్యాలీ గా వెళ్లి గ్రామ శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన జెండా గద్దె వద్ద గ్రామ శాఖ అధ్యక్షులు మీసాల పోశెట్టితో కలిసి బహుజన సమాజ్ పార్టీ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది.అనంతరం దట్నూర్ గ్రామానికి చెందిన యువకులు,మహిళలు వివిధ పార్టీల నుండి భారీ సంఖ్యలో బహుజన సమాజ్ పార్టీ లో చేరడం జరిగింది.ఈ సందర్భంగా నక్క విజయ్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లినా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణాలో తమ బ్రతుకులు ఏ మాత్రం మారలేదని,ఈ బి.ఆర్.ఎస్ పార్టీ పాలనలో సొంతింటి కల నెరవేరలేదనీ,ఇంకా పింఛన్ రాని దివ్యాంగులు,వృద్ధులు ఎందరో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దేశంలో అణగారిన వర్గాలకు అధికారం అందించడం కోసం పుట్టిన ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీ అనీ, తెలంగాణలోని ప్రతి పల్లెలో బిఎస్పీ జెండా ఎగరడం చరిత్రాత్మక అవసరమని,ధర్మపురి నియోజకవర్గంలో ప్రతి గడపకు,ప్రతి గుండెకు బహుజన వాదం చేరేవిదంగా కష్టపడి రానున్న ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గంలో బీఎస్పీ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు కుశునపెళ్లి శ్రీనివాస్,గ్రామ శాఖ ఉపాధ్యక్షుడు హన్మండ్లు, ప్రధాన కార్యదర్శి గంగాధర్,గొల్లపల్లి మండల అధ్యక్షులు కళ్లెపెళ్లి తిరుపతి, మహిళ విభాగం అధ్యక్షురాలు కొత్తూరి మనీషా,మహిళ కో కన్వీనర్ మానాల చంద్రకళ,ఎండపెల్లి మండల అధ్యక్షులు తడగొండ కార్తీక్,బివిఎఫ్ నియోజకవర్గ ప్రెసిడెంట్ రామడుగు వెంకటేష్,జగిత్యాల జిల్లా ఎస్ ఎస్ యు ప్రెసిడెంట్ బెజ్జంకి అజయ్,నాయకులు బిరుదుల స్వామి, చిలుముల అజయ్,నరేష్,రవి,శేఖర్,సాయి,ప్రేమ్,నల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]


