అరుకులోయ నియోజకవర్గం, అల్లూరి సీతారామరాజు జిల్లా: పెదబయలు మండల పరిషత్ కార్యాలయాన్ని గురువారం అరుకు ఎమ్మెల్యే ఫాల్గుణ, అల్లూరి జిల్లా కలెక్టర్ సుమిత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ మాట్లాడుతూ…. ఆంధ్ర రాష్ట్రంలో వైసిపి పార్టీ ప్రభుత్వం ఏర్పాటు అనంతరం ప్రజలకు అధికారులు చేరువలో ఉండి పరి పాలన సౌలభ్యంగా ఉండాలనే దృఢ సంకల్పంతో అనేక ప్రభుత్వ కార్యాలయాలు నిర్మాణం జరిగాయని గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ప్రభుత్వ కార్యాలయలకు ఒక ప్రణాళిక అనేది లేకుండా వుండేదని వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామ సచివాలయ వ్యవస్థలు తీసుకురావడంతో చాలా వరకు సమస్యలను సచివాలయాల పరిధిలోనే పరిష్కారం లభిస్తుందని టీడీపీ ప్రభుత్వ హయంలో తమ సమస్యలు పరిష్కారం కానప్పుడు వచ్చిన ఫిర్యాదుదారులు లబ్ధిదారులు భావేద్వేగాలకు లోనయ్యి ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరిగేవని అలాంటి ఆలోచనలు రానీయకుండా అధికారులు సమిష్టి కృషి తో ప్రజలకు సేవలు అందించాలని వైసిపి ప్రభుత్వంలో అర్హులైన ఏ పేదవాడు కూడా కన్నీరు పెట్టుకోకూడదనేదే మా ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ ఫలాలు అందిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అధికారులు అర్హులైన పేదలకు ఆ సంక్షేమ ఫలాలు అందించలేక పోతే ఆ చెడ్డ పేరు వైసిపి పార్టీకి వస్తుందన్నారు.
[zombify_post]

