అల్లూరి జిల్లా కేంద్రమైన పాడేరు లో రహదారిపై పశువుల సంచారంతో వాహనదారులతో పాటు పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మెయిన్ రోడ్డు, అంబేద్కర్ సెంటర్, సినిమా హాల్ సెంటర్, ఆర్టీసీ కాంప్లెక్స్ ఏరియాలో రాత్రి పగలు తేడా లేకుండా పశువుల గుంపులు గుంపులుగా సంచరిస్తున్నాయి. దీంతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయిని వాహనదారులు వాపోతున్నారు. అంతేకాకుండా వాహనాలు ఢీ కొన్ని పశువులు మరణించిన సంఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. తక్షణమే అధికారులు స్పందించి పశువుల సంచారాన్ని అరికట్టాలని కోరుతున్నారు.
[zombify_post]

