in , ,

ఆగం చేస్తున్న ఐచ్చిక సెలవు

ఈ రోజు ఉన్న ఆప్షనల్ హాలిడేని రేపటికి మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని నిన్నటి తేదీ తో ఉత్తర్వు ఇవ్వడం జరిగింది. DEO లు దాని ఆధారంగా ఈ రోజు ఉదయం  సమాచారం ఇచ్చారు. ఇది సరైన విధానం కాదు.ఇప్పటికిప్పుడు  పిల్లలు బడికి రమ్మంటే ఎలా వస్తారు?ఉపాధ్యాయులు కూడా సెలవు కావడం తో ఏదో ఒక ప్రణాళిక చేసుకొని ఉంటారు. ఇలా జరగడం మొదటి సారి కాదు.భారీ వర్షాల నేపథ్యం లో కూడా ఇలాగే ఉదయం 10గం.ల తర్వాత సమాచారం ఇచ్చారు. సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం MPPS సింగిరెడ్డి పాలెం ఉపాధ్యాయురాలు కవిత గారు ఈ ఆకస్మిక సెలవు రద్దు ప్రకటన హడావుడి లో రోడ్డు ప్రమాదానికి గురై చనిపోయినట్టు సమాచారం. ఇకనైనా ఈ విధానం మానుకోవాలని TSUTF సత్తుపల్లి మండల శాఖ డిమాండ్ చేస్తున్నది.

[zombify_post]

Report

What do you think?

వైస్ చైర్మన్ పదవి మాల సామాజిక వర్గానికి – హర్షం వ్యక్తం చేసిన: జై భీమ్ శ్రీనివాస్*

ఎన్నికల శంఖారావం పూరించిన ఎమ్మెల్యే సతీశ్ కుమార్