అల్లూరి సీతారామరాజు జిల్లా , అరుకు నియోజకవర్గం : హుకుంపేట మండలం పాతసుజుకోట పంచాయతీ సూదిమెట్ట గ్రామంలో బుధవారం 15వ ఆర్థిక సంఘం నిధులతో డ్రైనేజి పనులకు జెడ్పీటీసీ రేగం మత్స్యలింగం శంకుస్థాపన చేశారు. ముందుగా ఆ గ్రామస్తులు జడ్పీటీసీ గారికి సాధారంగా ఆహ్వానం పలికారు. జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి జల్లిపల్లి సుభద్ర గారు మండలంలోని గ్రామాల మౌలిక సదుపాయాలు కల్పనకు రూ.1500000 కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. "ఇంత వరకు మా గ్రామంలో ఎటువంటి అభివృద్ధికీ నోచుకో లేదని, గతంలో ఏ ప్రభుత్వమూ అభివృద్ధికి నిధులు కేటాయించిన దాఖలాలు లేవని, వైసీపీ ప్రభుత్వమే మొదటగా డ్రైనేజీ కల్పనకు నిధులు కేటాయించి నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పాటి లక్ష్మి, ఉప సర్పంచ్ కొట్టగుల్లి కొండబాబు, వార్డ్ మెంబర్లు జన్ని బొంజుబాబు, వెంగల బొంజుబాబు, పాటి చిన్నయ్య, సోనాభ చిన్నోడు, సెక్రటరీ ప్రదీప్, గ్రామస్తులు పాల్గొన్నారు.
[zombify_post]


