దళితుల భూమి లాక్కొని మంత్రి కొప్పుల ఈశ్వర్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం నిజం కాదా..బహిరంగ చర్చకు సిద్దమా అని జగిత్యాల డిసిసి అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.సోమవారం జగిత్యాల లోని ఇందిరా భవన్ లో ఏర్పాటుచేసిన సమావేశంలో డిసిసి అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నిరుపేదల పక్షపాతన్నారు.
జీవన్ రెడ్డి నీ విమర్శించే నైతిక హక్కు ఎమ్మెల్యే కు లేదని పేర్కొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల కోసం భు సేకరణ చేసి, ఇళ్లు కేటాయించింది జీవన్ రెడ్డి మాత్రమేనని
ఎమ్మెల్యే సంజయ్ ఇందిరమ్మ ఇళ్లు తామే కేటాయించాననడం హాస్యాస్పదమన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల బకాయిలు మీ ఇంట్లో కెళ్ళి ఏమైనా మాఫీ చేశారా అని ఎమ్మెల్యే సంజయ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ పార్టీ కి ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గలోనే ఉన్నాయన్నారు.
బీ ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తల కే సంక్షేమ పథకాలు..ఇస్తున్నారని విమర్శించారు.
ఈకార్యక్రమంలో పిసిసి ప్రచార కమిటీ కరివర్గ సభ్యులు గిరి నాగభూషణం, బండ శంకర్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటి పర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కళ్లే పల్లి దుర్గయ్య, కౌన్సిలర్ నక్క జీవన్
మాజీ కౌన్సిలర్ గాజుల రాజేందర్, పుప్పాల అశోక్, మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు సిరాజొద్ది న్ మన్సూర్, పిసిసి ఎన్ ఆర్ ఐ సెల్ కన్వీనర్ చాంద్ పాషా, కాంగ్రెస్ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు బొల్లి శేఖర్,యూత్ కాంగ్రెస్ అద్యక్షుడు గుండా మధు, కిషోర్ పాల్గొన్నారు.
[zombify_post]


