అల్లూరి జిల్లా: పాడేరు మన్యం మీదుగా జాతీయ రహదారి నిర్మాణంలో నాణ్యత లేమి కనిపిస్తోంది. ఏడాది గడవక ముందే రహదారి కుంగిపోయి పగుళ్లు వస్తున్నాయి. అరకు-పాడేరు ప్రధాన రహదారికి ఆనుకుని డుంబ్రిగూడ మండలంలోని గొందివలస సమీపంలో నిర్మించిన జాతీయ రహదారిపై పగుళ్లు ఏర్పడ్డాయి. పనుల్లో డొల్లతనంపై పలువురు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి రహదారి నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించే విధంగా చర్యలు చేపట్టాలని గిరిజనులు కోరుతున్నారు.
[zombify_post]


