- తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శమని బిఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారుఆదివారం భద్రాచలం పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, భద్రాచలం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తెల్లం వెంకట్రావులు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని అన్నారు.మరోమారు తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని ఆకాంక్షించారు. సుమారు 500 మంది వివిధ పార్టీల నుండి బిఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
[zombify_post]

