in

దశరథ్ మాంఝీ ఫోటో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా

[ad_1]

Dashrath Manjhi..Anand Mahindra

ఆసక్తిక ఫోటోలను..వీడియోలను షేర్ చేసే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఇంజనీర్ల దినోత్సవం సందర్భంగా  (Anand Mahindra) ట్విట్టర్ దశరథ్ మాంఝీ (Dashrath Manjhi)ఫోటోను షేర్ చేశారు.  ఎవరీ దశరథ్ మాంఝీ..? తెలుసుకుందాం..

ధశరథ్ మాంఝీ. బీహార్ (Bihar) లోని గయ (gaya)జిల్లాకు చెందిన గెహ్లోర్ గ్రామానికి చెందిన ఓ సామాన్య వ్యక్తి. పేద కుటుంబంలో పుట్టాడు.  కొన్ని గొర్రెల్ని అమ్మేసి ఆ డబ్బులతో గునపం,పార, ఉలి వంటి తవ్వకానికి కావాల్సిన పనిముట్లు కొన్నాడు. వాటితో కొండపైకి ఎక్కి తవ్వడం ప్రారంభించాడు. 360 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పు ఉన్న  కొండను, 10 ఏళ్లపాటు తవ్వి తవ్వి కొండను చీల్చాడు. అతడి కృషి ఫలితంగా సుమారు 60 గ్రామాల ప్రజలకు పాట్నా దగ్గర అయింది. ఇతడు కొండను తొలవడంతో మౌంటెన్ మ్యాన్ ఆఫ్ ఇండియా గా పేరొందాడు. ఇతడి ఘనత ఇంజనీర్ల దినోత్సవం రోజున ఆనంద్ మహీంద్రా.. ఈ తరం ఇంజనీర్లకు పరిచయం చేశారు. ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇంజనీర్ల దినోత్సవం రోజు అద్భుతమైన ఇంజనీర్ ను మాకు పరిచయం చేశారంటూ వారు కొనియాడుతున్నారు.

Report

What do you think?

Written by Naga

“టీడీపీ నాయకుల్లో ఆనందం”

పార్వతీపురం’ పోటీ పరీక్షలకు ఉత్తమ శిక్షణ