న్యూస్ టుడే, విశాఖపట్నం : పరవాడ మండలం భరణికం పంచాయతీ పరిధిలో 25 లక్షల NREGS నిధులతో నిర్మించిన సచివాలయం ను ముఖ్య అతిధిగా విచ్చేసినటువంటి పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ గారు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్బంగా అయన మాట్లాడుతు మన ముఖ్యమంత్రి శ్రీ వైస్ జగన్ మోహన్ రెడ్డి గారు తన సుధీర్గ పాదయాత్ర లో ప్రజల సమస్య లు తెలుసుకొని తన ఏ జెండాలో దానికి సంబందించిన 3 పేజీల మ్యానిఫెస్టో లో రూపొందించారు అని అన్నారు. దానికి అనుకూలం గానే ప్రజలకి లబ్ది చేకూరెందుకు ఈ సచివాలయం వ్యవస్థ ని రూపొందించారు అని అన్నారు. అలానే వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు. ఏ నాయకుడి ప్రమేయం లేకుండా నేరుగా ప్రజల దగ్గరికి చేరుతాయి అన్నారు.ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారి పాలనలో ద్వారా యావత్తు భారతదేశం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది అన్నారు. గాంధీజీ కలలు కన్న పాలన మన జగనన్న ద్వారా సాధ్యం అయ్యింది అని అయన తెలిపారు. ఈ కార్యక్రమం లో ఆ ఊరి సర్పంచ్, తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]


