in ,

అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం

న్యూస్ టుడే,  విశాఖపట్నం: గాజువాక నియోజకవర్గంలో  75 వ వార్డ్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి గారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేము ఓడిన గెలిచిన ఎప్పుడు ప్రజల పక్షానే అని అయన తెలిపారు. పెదగంట్యాడ సచివాలయం పరిధిలో,  75 వ వార్డు సీతానగరం ఎస్సీ కాలనీ పరిధిలో ఆరు లక్షల వ్యయంతో కాంపౌండ్ వాల్ నిర్మాణం.  సీతానగరం సచివాలయం పరిధిలో 20 లక్షల వ్యయం తో కళ్యాణమండపం నిర్మాణం.  రజక వీధి దుర్గా దేవి ఆలయం వద్ద 15 లక్షల వ్యయంతో మినీ కళ్యాణ మండపం నిర్మాణం.  సీతానగరం నూకాలమ్మ తల్లి ఆలయం వద్ద 20 లక్షల వ్యయంతో కాంపౌండ్ వాల్ నిర్మాణం వంటి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది.  ఈ కార్యక్రమంలో గాజువాక నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త,  ఇప్పల దేవాన్ రెడ్డి గారు, 75 వ వార్డు కార్పొరేటర్ పులి లక్ష్మి గారు,  75 వ వార్డు వైసిపి అధ్యక్షుడు,  శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by Balakishan

ధర్మారం మండలంలో పర్యటించిన మంత్రి కొప్పుల

కోనసీమ జిల్లా బీజేపీ అధ్యక్షునిగా ఎన్నికైన యాళ్ల దొరబాబు