in , ,

18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు ఓటు కోసం నమోదు చేసుకోవాలి

స్వీపా కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా
డుతూ అక్టోబర్ 1, 2023 నాటికి 18సంవత్సరాలు నిండబోయే ప్రతి ఒక్కరికి
ఓటు హక్కు కల్పించడం జరుగుతుందని, ప్రతి కళాశాలలో ఓటు ప్రాముఖ్యత
పై విద్యార్థులకు వివరించాలని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో అదనపు కలె
క్టర్ అరుణశ్రీ, పెద్దపల్లి ఆర్డీఒ మధుమోహన్, స్వీప్
ఆక్టివిటీస్ జిల్లా నోడల్
అధికారి రౌఫన్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. కె.లక్ష్మి నర్సయ్య,
కళాశాలల ప్రిన్సిపాల్స్, విద్యార్థిని విద్యార్థులు, అధికారులు పాల్గొన్నారు.
ఓటు హక్కుపై అవగాహన ర్యాలీ
దిలావర్పూర్ : బుధవారం దిలావర్పూర్ మండలంలో ఓటు హక్కుపై ఏర్పా
టు చేసిన ర్యాలీలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి పంచాయతీ కార్యా
లయం వరకు విద్యార్థుల ర్యాలీలో జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ
సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటు అనేది రాజ్యాంగం ఇచ్చిన హక్కు
అని, దానిని ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా నిష్పక్షపాతంగా ఉప
యోగించుకుంటే మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంటుంద అన్నారు. ప్రతీ
కుటుంబంలో ఓటు హక్కు వంద శాతం వినియోగించుకునేలా అవగాహన
కల్పించాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందన్నారు. 18 సంవత్సరాలు నిండిన
యువతీయువకులు తప్పనిసరిగా ఓటరుగా నమోదు కావాలన్నారు. స్పెషల్
సమ్మరి విజన్లో భాగంగా ఈనెల 19 వరకు ఓటు హక్కును దరఖాస్తుకు అవ
కాశం ఉన్నట్లు ఆయన అన్నారు. ఇంకనూ ఓటరుగా నమోదు కాని వారుంటే
వెంటనే నమోదు చేసుకోవాలని ప్రతీ ఒక్కరూ తమ మొబైల్లో ఓటరు హెల్ప్
లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని, ఇది వరకు నమోదై ఓటు హక్కు పొందిన
వారు తమ ఓటు ఉందో లేదో చెక్ చేసుకోవాలని, అదేవిధంగా తమ కుటుంబ
సభ్యుల ఓటు ఉందో లేదో చెక్ చేసుకోవాలని, లేకపోతే వెంటనే నమోదు చేసు
కోవాలని అన్నారు. వచ్చే 1 అక్టోబర్ నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు
ఓటరుగా నమోదు చేసుకోవచ్చన్నారు. అనంతరవ వైద్యశాఖ ఆధ్వర్యంలో
ఎనీమియా సే నిర్మల్ ముక్త్ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. రక్తహీన
తతో బాధపడకుండా పౌష్టికాహారం తీసుకోవాలని, ప్రతీ ఇంట్లో న్యూట్రి
గార్డెన్ ఏర్పాటు చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎంపిపి అక్షర,గ్రామ
సర్పంచ్ వీరేష్ కుమార్, ఎంఆర్వో సరిత, ఎంపిడివో మోహన్, ఎంపివో
కస్తూర్భా ఎస్ఓ అపర్ణ, జడ్పిపిఎస్ హెడామస్టర్ లక్ష్మణ్, వైద్య సిబ్బంది.
సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by Sathish

విశాఖ కొత్త సిపి డా.రవిశంకర్ అయ్యర్ బాధ్యతల స్వీకరణ

తక్షణమే కల్వర్టు మరమ్మతులు చేపట్టాలి