16 & 17 తేదీల నుంచి గోమయ గణేష్ ప్రతిమల పంపిణీ: అల్లోల దివ్యా గౌతంరెడ్డి
నిర్మల్ నియోజకవర్గంలో ప్రతీ ఏటా క్లిమామ్ సంస్థ, ఐకేఆర్ ఫౌండేషన్ ఆద్వర్యంలో ఉచిత గోమయ గణపతులను పంపిణీ చేస్తున్నట్లు అల్లోల గౌతంరెడ్డి, సేవ్ దేశీ కౌస్ క్యాంపెనర్, క్లిమామ్ వ్యవస్థాపకురాలు అల్లోల దివ్యారెడ్డి తెలిపారు. గత ఎనిమిది సంవత్సరాలుగా పర్యావరణానికి హానిచేయని విధంగా గోమయం, పసుపు, మట్టి, చింతగింజలు, వేపాకు మిశ్రమం, ఎండు గడ్డి ఉపయోగించి గణేష్ ప్రతిమలను తయారు చేస్తున్నామని వెల్లడించారు. శాస్త్రినగర్ లోని మంత్రి గారి క్యాంపు కార్యాలయంలో వీటిని 16 & 17 తేదీల్లో ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. *గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు సర్పంచ్లు వార్డు కౌన్సిలర్లు* వచ్చి ఈ గోమయ వినాయక ప్రతిమలను తీసుకెళ్ళి, ప్రతిష్టించాలని కోరారు. మంత్రి క్యాంప్ కార్యాలయంలో పేర్లను నమోదు చేసుకుని వీటిని తీసుకెళ్లవచ్చని చెప్పారు.
[zombify_post]

