15న విజయనగరం జిల్లాకు ముఖ్యమంత్రి రాక
విజయనగరం జిల్లా కేంద్రంలో నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభించే నిమిత్తం సీఎం వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి సెప్టెంబరు 15న జిల్లాకు వస్తున్నట్టు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. ఇక్కడి వైద్య కళాశాల ప్రాంగణం నుంచే రాష్ట్రంలో మరో నాలుగు వైద్య కళాశాలల్ని ఆన్లైన్ ద్వారా సీఎం ప్రారంభిస్తారని చెప్పారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో జిల్లా ఎస్పీ దీపికతో కలసి అధికారులతో సమీక్షించారు.
[zombify_post]
