ముంచంగిపుట్టు మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాల-2లో ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న విద్యాబోధనను ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రతి విద్యార్థితో మాట్లాడుతూ విద్యాబోధన ఏ విధంగా జరుగుతుందనే అంశంపై ఆరా తీశారు. విద్యార్థులను పలు ప్రశ్నలు వేసి వారి విద్యాస్థాయిని అంచనా వేసే ప్రయత్నం చేశారు. అనంతరం సుభద్ర మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలో గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన మార్పులు మంచి ఫలితాలు ఇస్తున్నాయన్నారు. నాడు ప్రభుత్వ పాఠశాలలో పరిస్థితులు… నేడు కల్పించిన సదుపాయాలను ప్రజల స్పష్టంగా గమనిస్తున్నారన్నారు. కార్పొరేట్ స్థాయికి మించి ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించారని చెప్పారు. గ్లోబలైజేషన్ నేపథ్యంలో పోటీ ప్రపంచాన్ని ఎదుర్కొనేలా సర్కారు బడుల్లో చదివే విద్యార్థులు తయారు చేసే విధంగా విద్యా విధానంలో మార్పులు తీసుకొచ్చారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అరిసెల సీతమ్మ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రధాన కార్యదర్శి అరబీరు జగబంధు, మండల పార్టీ ప్రెసిడెంట్ మల్లికార్జున్ , సుజన కోట ఎంపీటీసీ సుబ్బలక్ష్మి, సుజన కోట సర్పంచ్ రమేష్ , జోలపుట్టు సర్పంచ్ నీలకంఠం, మాకవరం సర్పంచ్ గంగాధర్, వైఎస్ఆర్సిపి నాయకులు సాధురం , ,రాంప్రసాద్, సన్యాసి , తిరుపతి, అప్పారావు, జయదేవ్, రఘు తదితరులు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!