in ,

స్వర్ణకారుల నిరాహార దీక్షకు సంఘీభావం- బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి

స్వర్ణకారుల నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపిన బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి.

స్వర్ణ కారుల ఆత్మహత్యల గురించి, కార్పొరేట్ షాప్ ల మూలంగా ఉపాధి కోల్పోతున్న స్వర్ణకారులకు ప్రభుత్వం చేయూత అందించాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా కేంద్రం లోని RDO కార్యాలయం ఎదుట నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న సర్ణకారులకు మహేశ్వర్ రెడ్డి గారు సంఘీభావం తెలిపారు. ఈ సంధర్బంగా మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర లో చేతివృత్తుల వారికి మంచి రోజులు వస్తాయని భావించినా, విశ్వబ్రాహ్మణ స్వర్ణకారుల కు స్వరాష్ట్రం లోనూ అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు.

*ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్న 5 మెన్ కమిటీ రిపోర్ట్ ను యధాతధంగా అమలు చేయాలని, అదేవిధంగా స్వర్ణకారుల అభివృద్ధి కోసం "స్వర్ణకారుల వెల్ఫేర్ బోర్డ్" ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

*స్వర్ణ వృత్తి చేస్తూ మరణించిన వారికి 5 లక్షల ఎక్స్ గ్రెశియా తో పాటు, చెనేత గీతకార్మికులకు ఇస్తున్న పెన్షన్ భీమా ను అదేవిధంగా గా 5000/- రూ లు ఆందించాలని అన్నారు. స్వర్ణకారుల న్యాయమైన డిమాండ్ లను తక్షణమే పరిష్కరించాలని మహేశ్వర్ రెడ్డి గారు కోరారు.

రాబోయే బీజేపీ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజల ను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, స్వర్ణకారులు తదితరులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by Srikanth

ప్రతిపక్షాల దుష్ప్రచారం – కొటగుళ్లి భాగ్యలక్ష్మి

సిపిఎం వినూత్న నిరసన