in , ,

సెప్టెంబర్ 17 ముమ్మాటికి విద్రోహ దినోత్సవమే

  • సెప్టెంబర్ 17 వేలాదిమంది హిందూ ముస్లిం ప్రజా ఉద్యమకారులను ఊతకోత కోసి భూస్వాములకు జమీందారులకు లక్ష ఎకరాల భూమిని అప్పగించిన రోజే ఈ సెప్టెంబర్ 17 అని ఇది ముమ్మాటికి విద్రోహ దినమని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ పేర్కొన్నారు.
    తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ప్రపంచ చరిత్రలో ఒక లిఖించబడ్డ అక్షరాలేనని,1948 నిజాం రజాకార్లు మొత్తం ప్రజలను హింసించి మహిళలని అత్యాచారం చేసి వెట్టిచాకిరి చేయించుకునే పరిస్థితి నుంచి కమ్యూనిస్టులు ప్రజలు ఒక్కసారిగా తిరుగుబాటు చేసి పది లక్షల ఎకరాల భూములను మూడు వేల గ్రామ రాజ్యాలుగా స్థాపించుకొని విరోచిత పోరాటం చేసి సాధించుకున్న హక్కులని పటేల్ నెహ్రూ సైన్యం నిజాం రజి రజాకార్లకు కమ్యూనిస్టుల ఉద్యమాన్ని హక్కులని వారు సాధించుకున్న భూమిని మోకరిల్లి అప్పజెప్పిన రోజే ఈ విద్రోహ దినమని ఆయన అన్నారు. ఈనాడు బిజెపి టిఆర్ఎస్ పార్టీలు విమోచన దినోత్సవమని చెప్పి హడావుడి చేస్తూ ప్రజల పోరాట ఆలోచనలని పక్కదోవ పట్టించడం కోసం ప్రయత్నంచేస్తున్నాయని,అన్నారు.ప్రజలారా భూమి భుక్తి విముక్తి కొరకు సాగే పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యలమై పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
    ఈ కార్యక్రమలో లక్ష్మి, రామనర్సమ్మ,ఉదయ రాజు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

[zombify_post]

Report

What do you think?

Written by Vinod

భద్రాచలం నియోజకవర్గం

పెరియార్ ప్రపంచ ప్రజలందరి నాయకుడు

తెలంగాణ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులే..!