పాడేరు, అల్లూరి జిల్లా: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె. ఎస్. జవహర్ రెడ్డికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పాడేరు ఏజెన్సీ ముఖద్వారం గరికబంద చెక్ పోస్టు వద్ద శుక్రవారం సాయంత్రం పుష్ప గుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. ఐటిడి ఏ పి ఓ వి. అభిషేక్ విశాఖపట్నం ఎయిర్‌పోర్టు వద్ద పుష్ప గుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అల్లూరి సీతా రామ రాజు జిల్లా, పార్వతీ పురం మన్యం జిల్లా అధికారులతో శనివారం కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం నిర్వహించడానికి సి. ఎస్. పాడేరు చేరుకున్నారు. ఈ కార్య క్రమంలో రంపచోడవం ఐటిడి ఏ పిఓ సూరజ్ గనోరే తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]

