యాదాద్రి ఆలయానికి రిలీజియన్ కేటగిరిలో విద్యుత్ ప్రత్యేక రాయితీని తెలంగాణ ప్రభుత్వం అందించింది. యాదాద్రి ఆలయం విస్తరణ నేపథ్యంలో కరెంట్ బిల్లులు భారీగా పెరిగాయంటూ దేవస్థానం ఈవో గీత, విద్యుత్ విభాగం ఈఈ రామారావు ఆలయ పర్యటనకు వచ్చిన సమయంలో సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(ERC) ద్వారా దేవాలయానికి విద్యుత్ వినియోగంలో రాయితీని కల్పించారు. దీంతో ఆలయానికి నెలకు రూ.15లక్షల వరకు బిల్లుల భారం భారీగా తగ్గనున్నది.
[zombify_post]


