in ,

సీఎం కార్యాలయం నుంచి అంటూ నగదు కాజేత

మండపేట, తూర్పు గోదావరి జిల్లా:వివరాల కోసం ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్‌ చేస్తున్నాం.. నిలిచిపోయిన పథకాలకు సంబంధించి లింక్‌ పంపుతున్నాం క్లిక్‌ చేస్తే మీ ఖాతాలకు సొమ్ము  జమవుతుందని ఓ అపరిచిత వ్యకి నమ్మించి ముగ్గురి నుంచి రూ.15,498 కాజేశాడు.ఈ ఘటన మండపేట పట్టణంలో చోటు చేసుకుంది. ఎస్సై అశోక్‌ కుమార్‌ బుధవారం అందించిన వివరాల ప్రకారం పట్టణంలోని ఒక వాలంటీరుకు అపరిచిత వ్యకి ఫోన్‌ చేసి అమరావతిలోని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మాట్లాడుతున్నా మీ పరిధిలో అమ్మఒడి, జగన్న విద్యా దీవెన ఎవరెవరికి పెండింగ్‌లో ఉన్నాయో తెలియజేయాలని కోరారు. అటువంటి వారు ముగ్గురున్నారని వాలంటీరు చెప్పగా వారందరికీ ఫోన్లో కాన్ఫÄరెన్స్‌లో కలపాలని సూచించారు. అంతా లైన్లోకి వచ్చిన తర్వాత మీరు ఫోన్‌ పెట్టేయండి, నేను లబ్ధిదారులతో మాట్లాడుతానని వాలంటీరుకు సూచించడంతో ఆయన అలాగే చేశాడు.
తర్వాత ముగ్గురు లబ్ధిదారులతో మాట్లాడి లింక్‌ పంపుతున్నామని క్లిక్‌ చేయమని కోరాడు. అలా చేయగానే ఆ ముగ్గురు ఖాతాల నుంచి రూ. 15,498 డ్రా అయినట్లు చరవాణులకు సంక్షిప్త సందేశం వచ్చింది. వారు లబోదిబోమంటూ జరిగింది వాలంటీరుకు తెలియజేయగా ఆయన సంబంధితఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. ఇలా ఎవరు సమాచారం అడిగినా వివరాలు తెలియజేయవద్దని వారు వాలంటీరుకు సూచించారు. దీనిపై పి.శిరీష, మరో ఇద్దరు ఫిర్యాదు చేశారని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు.

[zombify_post]

Report

What do you think?

ఓటర్ నమోదుకు ప్రోత్సహించాలి

పట్టించుకునే వారు కరువయ్యారు