in , ,

సిపిఎం వినూత్న నిరసన

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం గొలుగుండ మండలం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద సిపిఎం పార్టీ అద్వర్యంలో కేంద్రం ప్రభుత్వం ప్రజావ్వేతిరేక విదానాలు,పెరుగుతున్నా ధరలును నియంత్రించాలని గ్యాసు బండ,అయిల్‌ డబ్బా,మోటర్‌ సైకిల్ తో విన్నూత్న నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆగస్టు  30 నుండి సెప్టెంబర్ 4 వరకు  సిపిఎం పార్టీ నిరసన కార్యక్రమాల్లో బాగంగా ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సబ్యులు అడిగర్ల రాజు  మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బిజేపి ప్రభుత్వ  నిత్యావసరాలను పంపిణిని నిర్వీర్యం  చేసి,నిత్యావసరాల ధరల పై ప్రభుత్వ నియంత్రణను రద్దచేసి,ప్రైవేటుకు వదిలేసిందని,దీనితో రోజు రోజుకూ ధరలు పెరుగు దలకు అడ్డూ అదుపు లేదన్నారు. పెంచిన విద్యుత్ చార్జీలు  వెంటనే రద్దు చేయాలని,అలాగే పెరుగుతున్న నిత్య వస్తువులు అధిక ధరలను అరికట్టాలన్నారు.ఇంకా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనీ, గ్రామీణ ఉపాధి నిధులు పెంచాలని ,రైతుల పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి, సోమనాధున్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలన్నారు. ఈ సందర్భంగా సిపిఎం సీనియర్ నాయుకులు సాపిరెడ్డి నారాయణముర్తి మాట్లాడుతూ గొలుగుండ మండలం లో  వివిధ రకాల ప్రభుత్వ భూములను సాగుచేస్తున్న గిరిజనలకు,రైతులకు సాగు నమోదు చేసి,సాగులో ఉన్న గిరిజన రైతలు పేరునా పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసారు. అలాగే ROFR సర్వే చేసి,పట్టాలు ఇవ్వాలేదు అన్నారు. నేటికీ అనేక గిరిజన గ్రామాలకు రోడ్డులు లేవు అన్నారు. ఈ కార్యక్రమలో సిపిఎం మండల కమీటి సభ్యులు ,రాజు,పండియ్యా,సత్తిబాబు,నాగభూషణం,అప్పారావు,శివ ,లక్ష్మణరావు  తదిరులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by N.Chiranjeevi

స్వర్ణకారుల నిరాహార దీక్షకు సంఘీభావం- బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి

కొత్తగూడెంలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం