డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా :
గడప గడప కి మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మూడు రోజుల క్రితం స్థానిక గణేష్ నగర్ కాలనీ లో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి పర్యటించడం జరిగింది. అప్పుడు స్థానికంగా మూడు చోట్ల రోడ్లు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందిని గమనించిన ఎమ్మెల్యే తక్షణం రెడ్ గ్రావెల్ తో రోడ్లను నిర్మించమని అధికార్లను ఆదేశించడం జరిగింది.దాంతో ఈ రోజు అధికారులు రెడ్ గ్రావెల్ తో రోడ్లను వేయడం జరిగింది.సమస్య చెప్పిన వెంటనే స్పందించి,పరిష్కరించిన ఎమ్మెల్యే జగ్గిరెడ్డి కి,ప్రజా ప్రతినిధులకు,అధికారులకు గణేష్ నగర్ కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలియపరిచారు
[zombify_post]


