పాలకొండ సబ్ కలెక్టర్ నూరుల్ కమర్ శ్రీకాకుళం జిల్లా టెక్కలికి ఆకస్మికంగా బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కె. జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
*పాలకొండ సబ్ కలెక్టర్ నూరుల్ కమర్ శ్రీకాకుళం జిల్లా టెక్కలికి ఆకస్మికంగా బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కె. జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఆ స్థానంలో మరో అధికారిని నియమించే వరకు అంతర్గత సర్దుబాటు చేయాలంటూ కలెక్టర్ నిశాంత్‌కుమార్‌కు సూచించారు. గతేడాది సెప్టెంబరు 14న నూరుల్ కమర్ విధుల్లో చేరారు. బాధ్యతలు తీసుకున్న వెంటనే పాలకొండ పై ప్రత్యేక దృష్టి సారించారు. పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణపై చర్యలు తీసుకున్నారు. ప్రతి రోజూ ఉదయం ఆరు గంటలకే పనులు తనిఖీ చేసి నగర పంచాయతీ అధికారులు, సిబ్బందికి ప్రత్యేక ఆదేశాలు ఇచ్చేవారు. ముఖ్యంగా పాలకొండ, వీరఘట్టంలో ఆక్రమణలకు అడ్డుకట్ట వేశారు. అధికార పార్టీ నాయకులు కొందరు పాలకొండ పట్టణంలో ఆక్రమణలకు యత్నించగా ఆయన అడ్డుకున్నారు. అప్పటి నుంచి ఈయనపై కొందరు నాయకులు అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈయన ఆకస్మిక బదిలీ చర్చనీయాంశమైంది.
[zombify_post]

