రణస్థలం మండలం కోష్ట గ్రామంలో శ్రీ రాధా గోవింద మందిరంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా గురువారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు ఎచ్చెర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మంత్రి శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]


