in

వైకాపాలో వర్గవిభేదాలు.. మంత్రి పెద్దిరెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకున్న కార్యకర్తలు

babu

లశాంతిపురం: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలో వైకాపా వర్గవిభేదాలు బయటపడ్డాయి. మండలానికి చెందిన ముఖ్యనేత దండపాణికి వ్యతిరేకంగా మరో వర్గం ఆందోళనకు దిగింది..

మోరసనపల్లిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన నేపథ్యంలో ఐదు గ్రామాలకు చెందిన వైకాపా కార్యకర్తలు అక్కడికి చేరుకుని మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. దండపాణికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ప్రభుత్వ స్థలంలో అధికార పార్టీ నేత ఆక్రమణలను అరికట్టాలంటూ ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు, వైకాపా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో కుప్పం- పలమనేరు జాతీయ రహదారిపై అసమ్మతి నేతలు బైఠాయించారు. వైకాపా నేతలకు మంత్రి పెద్దిరెడ్డి సర్దిచెప్పి గుడుపల్లి వెళ్లారు. ఇంతకుముందే తమ సమస్యను నియోజకవర్గ నాయకుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో పెద్దిరెడ్డి ఎదుట ఆయా గ్రామాల వైకాపా కార్యకర్తలు నిరసనకు దిగారు..

[zombify_post]

Report

What do you think?

Written by Allagadda CM news

బండరాయిలకు ప్రాణం పోస్తున్న కళాకారుడు…

నేడు ఆరోగ్యసురక్ష, సీఆర్‌డీఏపై సీఎం జగన్‌ సమీక్ష