in ,

వృత్తి నైపుణ్య శిక్షణకు దరఖాస్తులు ఆహ్వనం

 పాడేరు , అల్లూరి జిల్లా: నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గిరిజన నిరుద్యోగ యువత నుండి వృత్తి నైపుణ్య రంగాలలో తగిన శిక్షణ అందించడానికి దరఖాస్తులు ఆహ్వా నిస్తున్నామని ఐటిడిఏ పి ఓ వి. అభిషేక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేసారు. వృత్తి నైపుణ్య శిక్షణ అందించడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తున్నామన్నారు. పాడేరు ఐటిడి ఏ పరిధిలోని 11 మండలాలకు చెందిన నిరుద్యోగ గిరిజన యువత సంబంధిత మండల అభివృ ద్ధి అధికారి కార్యాలయంలో ఈనెల 20 తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. టైలరింగ్, నిర్మాణ రంగం, పర్యాటక మరియు ఆతిథ్య రంగం, స్లంబింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమోటివ్, సెక్యూరిటీ గార్డు, తాపీ పనిలో ఆసక్తి మేరకు శిక్షణ అందిస్తారని చెప్పారు.ముఖ్యంగా జి.కె. వీధి, చింతపల్లి, జి.మాడుగుల, పాడేరు, పెదబయలు, ముంచింగుట్టు, హుకుంపేట, డుంబ్రిగుడ మండలాలకు చెందిన మారుమూల గ్రామాలకు చెందిన గిరిజన యువత దరఖాస్తు చేయాలని స్పష్టం చేసారు. అభ్యర్థి పూర్తి వివరాలు పేరు, తండ్రిపేరు, ఆధార్ నంబరు, మండలం, గ్రామం తెలియజేస్తూ ఎంపిడిఓ కార్యాలయంలో దరఖాస్తు చేయాలని కోరారు. గిరిజన నిరుద్యోగ యువత ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

[zombify_post]

Report

What do you think?

బ్రేకింగ్ న్యూస్

మైనర్ బాలిక అత్యాచారం కేసులో నిందితులకు 20ఏళ్లు జైలు శిక్ష