in ,

విశ్వసభలలో వివేకవాణికి 130 యేళ్ళు

డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా : 

స్వామి వివేకానంద అమెరికా నందలి షికాగోలో జరిగిన విశ్వమత మహాసభలో ప్రసంగించి 130 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చెయ్యేరు గున్నేపల్లిలో వివేక భారతి ట్యూషన్ సెంటర్ నందు శ్రీ సలాది శ్రీరామచంద్ర మూర్తి ఏర్పాటుచేసిన స్మారక సభ ఘనంగా జరిగింది.

ముందుగా స్వామి వివేకానంద చిత్ర పటానికి గొలకోటి వెంకటరెడ్డి మరియు డా,,గొలకోటి పల్లంరాజు పుష్పమాల వేసి కార్యక్రమం ప్రారంభించగా, సలాది జ్యోతి, పోలిశెట్టి శ్యామలాంబ, శ్రీమతి సూర్య కుమారిలు జ్యోతి ప్రజ్వలన చేసారు.

విద్యార్థులు స్వామీ వివేకానంద జీవిత చరిత్ర గురించి ఉపన్యాసాలు వినిపించి, దేశభక్తి గీతాలు ఆలపించారు.ఈ కార్యక్రమంలో వివేక భారతి వ్యవస్థాపకులు సలాది శ్రీరామచంద్ర మూర్తి మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న యువత తలుచుకుంటే ఆదర్శ గ్రామాలు నిర్మాణం చేయగలరని, 

 వివేకానంద జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని అందరూ అన్నిరంగాల్లో అభివృద్ధి వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.అనంతరం సమాజ సేవలో విశేష కృషి చేస్తున్న నల్లా మాష్టారు మరియు పురోహితులు సుబ్రహ్మణ్యం లను సన్మానించి వారి సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ హిందూ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు గొలకోటి వెంకటరెడ్డి, యస్.వి నాయుడు, గాలిదేవర బుల్లి, గండ్రోతి రవి, సుంకర శ్రీను, గనిశెట్టి శ్రీను, సంధ్యా గురుకుల పర్యవేక్షకులు రావూరి దొరబాబు, బొలిశెట్టి వీరర్రాజు, రాష్ట్ర సమన్వయకర్త బి.లక్ష్మీ నారాయణ, వివేక భారతి విద్యార్థులు మరియు అధిక సంఖ్యలో యువతీ యువకులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by Kiran

ఆధారాలు ఉంటే లోకేష్ నైనా అరెస్టు చేస్తాం: హోంమంత్రి వనిత

చట్టం ఎవరికి చుట్టం కాదు, చట్టం ముందు అందరూ సమానులే : బడుగు