- విశాఖ పోలీస్ కమిషనర్ త్రివిక్రమ్ వర్మ ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాది క్రితం కమిషనర్ గా వచ్చిన ఆయన నగరంలో శాంతి భద్రతలు, గంజాయి మాదక ద్రవ్యాలు అరికట్టడంలో విశేషంగా కృషి చేశారు. అంతేకాకుండా పోలీస్ శాఖలో వివిధ సంస్కరణలు అమలు చేసి పోలీస్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేశారు. కాగా ఆయనను ప్రభుత్వం స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఐజీగా నియమించింది. ఆయన స్థానంలో పోలీస్ కమిషనర్ గా డాక్టర్ రవిశంకర్ ను నియమించింది. కాగా త్రివిక్రమ్ వర్మ బదిలీ చర్చనీయాంశం అయింది.
[zombify_post]


