గిరిజన విద్యార్థుల్లోని సామర్ధ్యలను గుర్తించి ప్రత్యేక యాప్లో నమోదు చేయాలని ఐటీడీఏ పీవో ప్రతీకై జైన్ సూచించారు.శుక్రవారం తన కార్యాలయం నుంచి ఏపీవో జనరల్ డేవిడ్జ్, డీడీ మణెమ్మ, ఏసీఎంవో రమణయ్య, జీసీడీవో అలివేలు మంగతాయారుతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గిరిజన గురుకుల విద్యాలయాల ప్రిన్సిపాళ్లు,ఉపాధ్యాయులతో మాట్లాడారు.3 నుంచి 7వ తరగతి విద్యార్థులకు బేసిక్ లెవల్ పరీక్షలను నిర్వహించి వారు ఎందులో వెనుకబడ్డారో గుర్తించేలా ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలని ఆదేశించారు.ప్రతి ఉపాధ్యాయుడు 50 మంది విద్యార్థుల బాధ్యతలను తీసుకుని తెలుగు,ఆంగ్లం,గణితంలో రాణించేలా కృషి చేయాలని సూచించారు. పదో తరగతిలో మెరుగైన ఫలితాల సాధనకు వంద రోజుల ప్రణాళికను తయారుచేసి అమలు చేయాలని స్పష్టం చేశారు.
[zombify_post]

