వరదబాధితుల పోరాటం ఓర్వలేక కొందరు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వరద బాధితుల పోరాట కమిటీ, సిపిఐ ఎంఎల్ ప్రజా పంథా పార్టీ నాయకులు కొండా చరణ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. వరద బాధితుల వద్ద వసూలు చేసి ఆస్తులు సంపాదిస్తున్నారని వస్తున్న తప్పుడు ప్రచారాలను ఆయన ఖండించారు. తప్పుడు ప్రచారాలు మాని దమ్ముంటే బహిరంగంగా నా అక్రమ ఆస్తుల వివరాలు బయట పెట్టాలని సవాల్ విసిరారు. వరదబాధితులకు 5సెంట్ల ఇంజాగాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని అధికారులను అడగడమేనా నేను చేసిన తప్పా అని ఆయన ప్రశ్నించారు. రాజకీయాలకు అతీతంగా వరద బాధితుల పక్షాన పోరాడుతున్న తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు.తప్పుడు ఆరోపణలకు తనకు సంబంధం లేదని అన్నారు. తనకు అక్రమంగా సంపాదించే గుణం ఉంటే ఈ రోజుకి ఇలా ఉండేవాడిని కాదని అన్నారు.నాకు ఉన్నదాంట్లో ప్రజలకు యాంతోకొంత ఉపయోగించానే కానీ ఎప్పుడు ప్రజలను ఆశించలేదని తెలిపారు. అప్పుడప్పుడు ప్రజల వద్ద ఆర్ధిక నిధి సేకరిస్తామని అది పార్టీ కోసంమే తప్ప ఎవ్వరి వ్యక్తిగత అవసరాలకు కాదని నొక్కి చెప్పారు.పిరికిపందల్లా దొంగచాటుగా ఆరోపణలు చేస్తే సహించేది లేదని చెప్పారు.మరోమారు ఇలాంటి ఆరోపణలు చేస్తే వారి అక్రమాలు,అరాచకాలను ఆధారాలతో సహా బహిరంగంగానే బట్టబయలు చేస్తామని హెచ్చరించారు.
[zombify_post]


