సూర్యాపేట రూరల్ మార్చి26:
మండల పరిధిలో సోలిపేట ప్రభుత్వ పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్న నర్రా యశ్వంత్…తన పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం ప్రాథమిక పాఠశాలకు నాలుగు వేల నగదును అందజేసి ఆశ్చర్యానికి గురిచేసిండు.
నర్రా అర్జున్- స్వాతి దంపతుల కుమారుడైన యశ్వంత్ తన కిడ్డీ బ్యాంకు నందు దాచుకున్న నగదును పదకొండవ పుట్టిన రోజున విరాళంగా ఇచ్చి చిన్నవాడైన పెద్ద మనసు చాటుకున్నాడు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు చిరంజీవి యశ్వంతును దీవించారు.ఇట్టి నగదును కుళాయి రిపేర్ల ఖర్చుల కోసం ఉపయోగిస్తామని ప్రధానోపాధ్యాయులు రామచంద్రనాయక్ తెలిపారు.
గత జనవరి నెలలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో తన తాతగారి పేరు మీద పదిహేను వేల రూపాయలను R.O/- ప్లాంట్ కోసం విరాళంగా ఉప సర్పంచ్ నర్రా సుగుణమ్మ ఇవ్వడం గమనర్హం.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!