పాడేరు సెప్టెంబరు 19 : ఈనెల 20వ తేదీన(బుధవారం) ముంచంగిపుట్టు ఎంపిడిఓ కార్యాలయంలో జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలియ జేసారు. ముంచంగి పుట్టు మండలానికి చెందిన ప్రజలు స్పందనలో పాల్గొని అర్జీలు సమర్పించాలని సూచించారు. అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన జిల్లా అధికారులందరూ 20 వతేదీన ఉదయం 10 గంటలకు స్పందన హాలుకు హాజరు కావాలని ఆదేశించారు.
[zombify_post]


