in

రావులపాలెం నుంచి అరుణాచల గిరి ప్రదక్షణ ప్రత్యేక బస్

డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం ఆర్టీసీ బస్ డిపో నుంచి రావులపాలెం డిపో నుంచి అరుణాచల గిరి ప్రదక్షణ కు ప్రత్యేక బస్ ఏర్పాటుచేయడం జరిగింది.ఈ ప్యాకేజ్  ఒక్కొక్కరికి సూపర్ లగ్జరీ (పుష్ బ్యాక్) రూ. 4500 రూపాయిలు అవుతుంది అని తెలిపారు.ఈ యాత్రలో భాగంగా తిరుత్తణి (సుబ్రహ్మణేశ్వరస్వామి),కాంచీపురం (కామాక్షిదేవి, పృథ్వీలింగం,చిదంబరం (ఆకాశలింగం),తిరుకడయూర్ (అభిరామి అమ్మవారు)

(అమృతఘడేశ్వర స్వామి),తిరువారూర్ (కమలాంబికదేవి, త్యాగరాజస్వామి)కుంభకోణం (ఆదికుంభేశ్వరస్వామి, మంగళాదేవి),తంజావూరు బృహదీశ్వరస్వామి) ,శ్రీరంగం (శ్రీరంగ నాథుడు),జంబ్బుకేశ్వర్ (జలలింగం),అరుణాచలం (అగ్నిలింగం),శ్రీకాలహస్తి (వాయులింగం), మొత్తం 11 పుణ్య క్షేత్రాలు దర్శించు కోవచ్చు ఈ యాత్ర  

ది. 27-09-2023 రావులపాలెం నుండి బస్సు బయలుదేరి పైన తెలిపిన క్షేత్రములు దర్శించుటతోపాటు ది. 02-10-2023 భాద్రపద పౌర్ణమి సందర్భముగా అరుణాచలగిరి ప్రదక్షణ మరియు దేవాలయాల దర్శనం అనంతరం రావులపాలెం చేరును అని డిపో మేనేజర్ తెలిపారు.అకామిడేషన్ మరియు భోజనములు ఎవరికి వారే సమకూర్చుకోవలెను అని తెలిపారు.పంచభూత లింగములు దర్శనముతోపాటు అరుణాచల పౌర్ణమి గిరి ప్రదక్షణ మరియు తమిళనాడులో ఇతర ప్రముఖ శైవక్షేత్రాలు దర్శనము చేసుకునే " మంచి అవకాశం అని అన్నారు.మరిన్ని వివరములకు మరియు టిక్కెట్ల కొరకు సంప్రదించు ఫోన్ నెంబర్ : అసిస్టెంట్ మేనేజర్, రావులపాలెం: 7382911871 నెంబర్ నీ సంప్రదించాలని తెలిపారు

.

[zombify_post]

Report

What do you think?

Written by Kiran

గొలుగొండ. ఏఎల్ పురం హైస్కూల్లో ఆటలపోటీలు ప్రారంభం

గిరిజన విద్యార్థులకు వంద రోజుల ప్రణాళిక అమలు