in ,

రామేశ్వరం మొగా పూడికతీత పనులకు 20 లక్షల రూపాయలు మంజూరు..

గోదావరి సెంట్రల్ డెల్టా లోని ప్రధాన డ్రైన్లు అయిన వాసాలతిప్ప మేజర్ డ్రైన్ ,దిగువ కౌశిక మేజర్ డ్రైన్ మరియు పంచనది మీడియం డ్రైన్ లు బంగాళాఖాతంలో కలిసే ప్రదేశంలో ఉన్న రామేశ్వరం మొగ పూడిక తీత పనులకు సిఎస్ఆర్ నిధుల కింద 20 లక్షల రూపాయలు మంజూరు చేశామని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతి సంవత్సరం సముద్రం యొక్క ఉదృత అలల చర్యల కారణంగా ఈ మొగ లో తరుచుగా ఇసుక మేటలు ఏర్పడుతున్నాయని తద్వారా అమలాపురం ఉప్పలగుప్తం అల్లవరం మండలాల్లోని గ్రామాల పరిధిలో సుమారు 35 వేల ఎకరాల ఆయకట్టుకు డ్రైనేజీ నీరు పొలాల్లో నిలిచిపోయి పంట నష్టం వాటిల్లుతోందన్నారు. ఈ సంవత్సరం వర్షపాతం తక్కువ గా నమోదు అవ్వడం,మొగ వద్ద డ్రైన్ల లో నీటి ప్రవాహం తక్కువ గా ఉండటం మరియు సముద్రం యొక్క అలల ప్రభావం ఎక్కువగా ఉండటం వలన గతం లో కంటే ఈ సంవత్సరం రామేశ్వరం మొగ ఎక్కువ గా పూడికకు గురి అయిందన్నారు. ఈ విషయాన్నీ గుర్తించిన ఇరిగేషన్ అధికారులు, జిల్లా యంత్రాంగం రామేశ్వరం మొగ పూడిక తీత పనులు చేపట్టిందన్నారు ఈ పూడిక తీత పనులు చేపట్టడం ద్వారా పంట పొలాల్లో మరుగు నీరు నిలవదని తద్వారా 35 వేల ఎకరాలలో పంటలకు ముంపు బారి నుండి రక్షణ కలగడం ద్వారా రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు . ప్రస్తుతం పనులు పురోగతిలో ఉన్నాయని పది రోజుల లోపు పూర్తి చేస్తామని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు.

  

 

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Written by Kiran

రామేశ్వరం మొగా పూడికతీత పనులకు 20 లక్షల రూపాయలు మంజూరు..

నారా లోకేష్ పాదయాత్రకు సర్వం సిద్ధం