in ,

రామాలయ సిబ్బంది ఎంపిక ప్రక్రియ?

భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి ఆలయంలో పొరుగు సేవల పద్ధతిలో ఇద్దరు సిబ్బందిని నియమించే ప్రక్రియ మొదలైంది. ఇక్కడ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కొందరికి సమాచారం చేరింది. ఇలాంటి వారు బుధవారం రామాలయం కార్యాలయానికి చేరుకున్నారు. వీరి కంప్యూటర్ పరిజ్ఞానం ఏమేరకు ఉందో అధికారులు పరీక్షించారు. రామాలయంలో పూజలతో పాటు వసతి సదుపాయం ఇటీవల ఆన్లైన్లో పొందుపర్చారు. ఈ నేపథ్యంలో సాంకేతిక అవగాహన ఉన్న వారిని గుర్తించి ఎంపిక చేసేందుకు పూనుకున్నారు. ఇందులో ఎంపికైతే ఆ ఇద్దరికి ఓ బ్యాంకు వేతనాలను అందించేందుకు అంగీకరించింది. రామాలయంలో పొరుగు సేవల ఉద్యోగులను ఎంపిక చేస్తున్నప్పటికీ కొంత మందికే ఈ సమాచారం చేరడం చర్చనీయాంశమైంది.

[zombify_post]

Report

What do you think?

Written by Vinod

భద్రాచలం నియోజకవర్గం

అయ్యప్ప భక్తులకు ప్రత్యేక బస్సు సౌకర్యం

నిమజ్జన ఏర్పాట్లపై ఆర్డీఓ పరిశీలన