వినాయక చవితి మండపాల ఏర్పాటు పేరుతో బలవంతపు వసూళ్లకు పాల్పడకూడదని రాజాం పట్టణ సిఐ కే. రవికుమార్ హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాజాము మండల పరిధిలో ఉన్న గ్రామాలలో గానీ, రాజాం పట్టణంలో గానీ, రోడ్లపై వాహనాలను ఆపి బలవంతముగా చందాల వసూళ్లకు పాల్పడినా, చిన్న పిల్లల చేత చందాలు వసూలు చేయించినా అట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ రవికుమార్ హెచ్చరించారు
[zombify_post]
