in ,

రాజాంలో భారీ చోరీ”30 తులాల బంగారం, రూ. లక్షల మేర అపహరణ’

రాజాం పట్టణంలోని వాసవి నగర్ లో సోమవారం రాత్రి భారీ చోరీ జరిగింది. సీఐ రవికుమార్ వివరాల ప్రకారం స్థానికంగా నివాసముండే జి. వెంకట రమణ పొగిరిలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.

30 తులాల బంగారం, రూ. లక్షల మేర అపహరణ

 రాజాం పట్టణంలోని వాసవి నగర్లో సోమవారం రాత్రి భారీ చోరీ జరిగింది. సీఐ రవికుమార్ వివరాల ప్రకారం స్థానికంగా నివాసముండే జి. వెంకట రమణ పొగిరిలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. బ్యాంకులో కుదవ పెట్టిన నగలను ఓ శుభకార్యం కోసం నెలరోజుల క్రితం బయటకు తీశారు. సోమవారం కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామం జి.సిగడాం మండలం ఎందువ వెళ్లి తిరిగి మంగళవారం ఉదయం వచ్చారు. ఇంటి తలుపులు తెరిచి ఉండటంతో పరిశీలించగా, చోరీ జరిగినట్లు గుర్తించారు. బీరువాలో ఉంచిన 30 తులాల బంగారం, రూ. లక్షల మేర నగదు అపహరణకు గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు ఇంటి వెనుక పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు ఇంటి వెనుక నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. సమీపంలోని సీసీ ఫుటేజీలు, ఇతర ఆధారాల కోసం అన్వేషిస్తున్నారు. దొంగ తన దుస్తులు వదిలేసి, ఇంట్లో ఉన్నవాటిని వేసుకుని ఉడాయించినట్లు సీఐ తెలిపారు.

[zombify_post]

Report

What do you think?

Written by Prasad

అతిసారం విజృంభణ”

పుష్ప’ తరహా సీన్ రిపీట్.. గంజాయి స్మగ్లర్లకు చుక్కలు చూపించిన పోలీసులు!”