రణం కంటే రాజీ మెరుగు అంటూ లోక్ అదాలత్ ను ఉద్దేశించి జిల్లా 6వ అదనపు జడ్జి వెంపటి అపర్ణ అన్నారు. సత్తుపల్లి కోర్టు ఆవరణలో శనివారం నిర్వహించిన లోక్ అదాలత్ లో ఆమె పాల్గొన్నారు. మండల న్యాయ సేవాదికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విఙ్ఞాన సదస్సు నిర్వహించారు. కక్షిదారులు రాజీ పడే కేసులను లోక్‌అదాలత్‌లో పరిష్కరించుకోవాలని, లోక్ అదాలత్ లో ఇచ్చే తీర్పు తుదితీర్పుగా ఉంటుందన్నారు. కంపౌండబుల్, బ్యాంక్ కేసులు, ఇన్సూరెన్స్ కేసులను రాజీ చేసుకునేవారు లోక్ అదాలత్‌ను ఉపయోగించుకోవాలని కోరారు. కక్షిదారులు లోక్ అదాలత్‌లో కేసులు పరిష్కరించ బడతాయన్నరు. లోక్‌అదాలత్‌లో కేసులను రాజీ కుదుర్చుకుని సమయాన్ని ఆదా చేసుకుని, ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి కావాలని కక్షిదారులకు సూచించారు. ముఖ్యంగా ఏళ్లతరబడి పరిష్కారం కాని దీర్ఘకాలిక కేసులను పరిష్కరించు కుని లబ్ధిపొందాలన్నారు. లోక్‌అదాలతలో కేసులు పరిష్కరించుకుంటే నగదు, సమయం ఆదా అవు తుందన్నారు. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, పోలీసులు పాల్గొన్నారు. రాజీ మార్గం ద్వారా కేసులను పరిష్కరించుకోవడానికి జాతీయ లోక్ అదాలత దోహద పడుతుందన్నారు. సివిల్, క్రిమినల్, బ్యాంకు రుణాల కేసులన్నింటిని జాతీయ లోక్ అదాలతలో పరిష్కరించడం జరుగుతుందని కక్షిదా రులు ఈ అవకాశాన్ని సద్వినియో గం చేసుకోవాల న్నారు. ఈ సందర్భంగా సుమారు 800వరకు కేసులు పరిష్కారం అయ్యాయి. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి పీ.అరుణ కుమారి, అదనపు జూనియర్ సివిల్ జడ్జి అయేషా శరీన్, సెకండ్ క్లాస్ న్యాయమూర్తి గోపాలరావు, న్యాయ వాదులు, కల్లూరు ఏ సీ పీ రామానుజం, సీఐ మోహన్ బాబు, బార అసోసియేషన్ అధ్యక్షలు పీ. శ్రీనివాస రావు పాల్గొన్నారు.
[zombify_post]


