in ,

ఐదు కొత్త వైద్య కళాశాలలు ప్రారంభం

15వ తేదీన ఒకేరోజు ఐదు కొత్త వైద్య కళాశాలలను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ప్రారంభించనున్నారు. వీటిలో విజయనగరం వైద్య కళాశాలను ప్రత్యక్షంగా, నంద్యాల, మచిలీపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరం వైద్య కళాశాలలను వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఒక వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి, అందులో భాగంగా 17 నూతన వైద్య కళాశాలల స్థాపనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వీటిలో ఐదు కళాశాలలకు భారత వైద్య విద్యామండలి (ఎంసీఐ) నుండి ఈ ఏడాది అనుమతి లభించింది. నీట్‌ పరీక్ష ద్వారా అర్హత సాధించిన విద్యార్థులను వైద్య కోర్సులో చేర్చుకుని ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభించాయి. వైద్యవిద్యను అభ్యసించేందుకు ఒక్కో కళాశాలలో 150 మంది విద్యార్థులు చేరారు. ఇందులో రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం వైద్య కళాశాలల నిర్మాణాన్ని ఎంఈఐఎల్‌ త్వరితగతిన పూర్తి చేసింది. పిడుగురాళ్ల, బాపట్ల, మార్కాపురం, మదనపల్లి, అనంతపురం, పెనుగొండ, తిరుపతి, అమలాపురం, పాలకొల్లులో వైద్య కళాశాలలు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. రాజమండ్రి మెడికల్‌ కాలేజీని 3.37 ఎకరాలలో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎంఈఐఎల్‌ నిర్మించింది. ఇందులో వైద్య కళాశాల, విద్యార్థులు, సిబ్బందికి వసతి, నర్సింగ్‌ కళాశాల, ప్రధాన బ్లాకులతో పాటు ప్రయోగశాలలు, లైబ్రరీ గది, లెక్చర్‌ హాళ్లు, బయోమెడికల్‌ వేస్ట్‌ డిస్పోజబుల్‌ రూమ్‌, వంటగది, క్యాంటీన్‌ ఉన్నాయి. అలాగే సముద్రతీరానికి సమీపంలో ఉన్న మచిలీపట్నం మెడికల్‌ కాలేజీ 64.38 ఎకరాల్లో విస్తరించి ఉంది. 13 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలను చేపట్టింది. సముద్రతీర ప్రాంతంలో ఉన్నందున నేల స్వభావం దృష్ట్యా నిర్మాణాలు పటిష్టంగా ఉండేలా బలమైన పునాదుల కోసం జియోటెక్స్‌టైల్‌, జియో-గ్రిడ్‌, గ్రాన్యులర్‌ సబ్‌-బేస్‌ వంటి వినూత్న పద్ధతులను ఎంఈఐఎల్‌ ఉపయోగించింది. నిర్మాణాన్ని మరింత సులభతరం చేయడానికి, ఉప్పులేని నీటిని నిల్వ చేయడానికి జియో మెమోరియల్‌ షీట్ల సహాయంతో 1.15 కోట్ల లీటర్ల సామర్థ్యం గల ప్రత్యేక నీటి నిల్వ ట్యాంక్‌ను నిర్మించింది. ఇక్కడ రోజువారీ నిర్మాణ పనులకు దాదాపు 50 వేల లీటర్ల నీరు అవసరం కాగా, ఇన్‌-పేషెంట్‌ డిపార్ట్‌మెంట్‌, అవుట్‌-పేషెంట్‌ డిపార్ట్‌మెంట్‌, డయాగ్నస్టిక్‌ బ్లాక్‌, మెడికల్‌ కాలేజీ మొదలైన నిర్మాణాలు ఇప్పటికే పూర్తికాగా మరికొన్ని పనులు కొనసాగుతున్నాయి.

ఏలూరు వైద్య కళాశాలకు సంబంధించి 11 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక వైద్య కళాశాల, 24/7 అక్యూట్‌ కేర్‌ బ్లాక్‌, మాతాశిశు సంరక్షణ భవనం, హాస్టళ్లు, స్టాఫ్‌ క్వార్టర్లు, రోగులు, సహాయకుల వసతి గృహం, క్యాంటీన్ల విస్తరణ వంటివి ఎంఈఐఎల్‌ చేపట్టి ఐదు కీలక బ్లాకుల పనులను అత్యంత వేగవంతంగా అందుబాటులోకి తీసుకొచ్చింది.

[zombify_post]

Report

What do you think?

Written by Prasad

రైతులకు అజోల్లాను పంపిణీ “

మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా షేక్ అన్సారీ బాషా