in , ,

మారుమూల అటవీ గ్రామంలో జ్వరం సర్వే..

చర్ల మండలం సత్య నారాయణ పురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న  వీరాపురం (జోడి చిలకల) గ్రామoలో డా.దివ్య నయన  అధ్వర్యంలో ఇంటి,ఇంటి సర్వే నిర్వహించి, నీటి నిల్వలలో  దోమలు పెరగకుండా తేమిఫోస్ ద్రావణం పిచికారీ చేయడం జరిగింది. వర్షాల కారణంగా నీటి నిల్వలు వున్నవి అవి గుర్తించిదోమలు ప్రభలకుండా నియంత్రణ చర్యలు చేపట్టేరు. డాక్టర్ నయన మాట్లాడుతు అందరూ కాచి చల్లార్చిన మంచినీరు త్రాగలని  దోమతెర లు తప్పని సరిగా కట్టుకోవాలని సూచించారు.
2 జ్వరం కేసులు నమోదు అయినవి, మలేరియా లేదు, వైరల్ జ్వరాలు. 25 మంది కి సాధారణ వ్యాధులకు చికిత్స చేసి మందులు పంపిణీ చేశారు. అలాగే చిన్న పిల్లలకి వ్యాధి నిరోధక టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో డి.పి.ఎం.ఓ సత్య నారాయణ, హెచ్.ఈ.ఓ బాబురావు, ఎం.ఎల్.హెచ్.పి పార్వతి, హెల్త్ అసిస్టెంట్లు వేణు, సమ్మక్క,శ్రీ లక్ష్మి ఆశా కార్యకర్త గంగమ్మ, అంగన్వాడీ టీచర్ పావని తదితరులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by K Sravan

కోడి పందాల స్థావరంపై దాడులు నిర్వహించిన పోలీసులు

చంద్రబాబు అరెస్ట్: ప్రజలే అండగా ఉండాలన్న భువనేశ్వరి… రాష్ట్రపతి , ప్రధానమంత్రి జోక్యం కోరుతూ లేఖ రాసిన ఎంపీ రామ్మోహన్