in , , ,

మహిళా ఆరోగ్య భద్రతకే ఋతుప్రేమ..! మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి

  • సూర్యాపేటను పచ్చదనం తో కూడిన ఆరోగ్యవంతమైన జిల్లాగా తీర్చిదిద్దుతా…

  • తెలంగాణ ఆచరిస్తుంది ప్రపంచం అనుసరిస్తుంది….

  • మహిళలంతా ఆరోగ్యవంతులుగా ఉండాలనేదే నా ఆశ….

  • మహిళ ఆరోగ్య భద్రతకే రుతుప్రేమ.!.

  • రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీష్ రెడ్డి

సూర్యాపేట ను పచ్చదనంతో కూడిన ఆరోగ్యవంతమైన పట్టణంగా  మారుస్తానని రాష్ట్ర అభివృద్ధి శాఖ మంత్రి గుంట కండ్ల జగదీష్ రెడ్డి తెలిపారు.మహిళ ఆరోగ్య భద్రతకే రుతుప్రేమ.!. కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు.నూతన కలెక్టరేట్లోలోని సమావేశ మందిరంలో బెంగళూరుకు చెందిన పర్యావరణవేత్త డాక్టర్ శాంతి ఆధ్వర్యంలో ఋతుప్రేమ పై మహిళలకు అవగాహన సదస్సు కార్యక్రమం లో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 

మహిళలంతా ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచనతో ఋతుప్రేమ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. సూర్యాపేట మహిళలు స్వచ్ఛ సూర్యపేట కోసం చేపట్టిన పవిత్రమైన యజ్ఞానంలో అందరూ భాగస్వామ్యం కావాలని మంత్రి పిలుపునిచ్చారు. మహిళలు రుతుస్రావ సమయంలో రసాయనిక ప్యాడ్స్ వాడటం వల్ల అనారోగ్య పాలవుతున్నారని, దీని కోసమే డాక్టర్ శాంతి ద్వారా జిల్లాలో రుతు ప్రేమ అవగాహన సదస్సులు జరిపి మహిళలందరూ ప్యాడ్స్ బదులుగా కప్స్ వాడే విధంగా  జిల్లా యంత్రాంగం సహాయంతో మహిళలకు అవగాహన కల్పిస్తున్నారని, ఈరోజు సూర్యాపేటలోని మహిళా ప్రజా ప్రతినిధులు, వార్డు కౌన్సిలర్లకు అలాగే సూర్యాపేట పట్టణంలోని మహిళ డాక్టర్లను కూడా ఈ అవగాహన సదస్సుకు పిలవడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలుపరుస్తూ అన్ని వర్గాల ప్రజలకు ఆసరాగా ఉంటుందని మంత్రి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అమలుపరుస్తున్న పథకాలను ప్రపంచ దేశాలు అనుసరిస్తున్నాయని మంత్రి ఆన్నారు. ప్రజలకు మంచి వైద్య సేవలు అందించాలని ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి పల్లె దవఖానాలు, బస్తి దవాఖానాలు ఏర్పాటు చేయడం జరిగిందని, అలాగే ఆరోగ్య మహిళా కేంద్రాలు ఏర్పరిచి మహిళల కోసం ప్రత్యేకంగా ప్రతి మంగళవారం ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని మంత్రి అన్నారు. 

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని మొక్కలు నాటడం, ప్లాస్టిక్ నిరోధించడం అందరం ఆచరించాలని మంత్రి పేర్కొన్నారు మంచి సమాజం కోసం మనమందరం కృషి చేయాలని మంత్రి తెలిపారు 30 సంవత్సరాల క్రితం సూర్యాపేటలో హైదరాబాదు నుండి మురుగునీరు మూసీ నదికి వచ్చేదని ఆ నీటిని తాగి ప్రజలు అనారోగ్య పాల అయ్యే వారిని ఒక బ్యాంకు ఉద్యోగి తన ఉద్యోగాన్ని వదిలి ఫ్లోరోసిస్ వ్యతిరేకంగా  పోరాడారని మంత్రి గుర్తు చేశారు. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మంచినీరు అందించడం జరుగుతుందని ఈ పథకం దేశంలో మరి ఎక్కడ లేదని మంత్రి అన్నారు. ప్రపంచమంతా సూర్యాపేట ని చూసి నేర్చుకునే విధంగా చేస్తానని, దీనిలో భాగంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం చేపట్టడం జరిగిందని దీనిలో ప్రతి షాపు నందు సూర్య రష్మితో నడిచే విధంగా ఎక్కడ ఫ్యాన్ లేకుండా చల్లని గాలులతో ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి అన్నారు. 

పట్టణాన్ని పరిశుభ్రతగా పచ్చదనంతో ఉండే విధంగా అందరూ తోడ్పడాలన్నారు. తడి పొడి చెత్త కాకుండా మూడో రకం హానికరమైన చెత్త ఒక సవాలుగా మారిందని వాటిలో ముఖ్యంగా మహిళా నాప్కిన్స్ చిన్నపిల్లలు డైపర్లు వల్ల పర్యావరణానికి హాని జరుగుతుందనే ఉద్దేశంతో వాటిని వాడకుండా పర్యావరణ వేత్త డాక్టర్ శాంతి  నాప్కిన్స్ కి బదులుగా కప్స్ వాడాలని వారి బృందం చేస్తున్న కృషికి నా ఆశీస్సులు అండదండలు ఎప్పుడూ ఉంటాయని మంత్రి తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు, జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సిహెచ్ ప్రియాంక, జెడ్పీ చైర్ పర్సన్ దీపికా యుగంధర్, మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ అన్నపూర్ణ శ్రీనివాస్, పెన్పాడు జడ్పిటిసి మామిడి అనిత ,చివేముల ఎంపీపీ కుమారి, జడ్పిటిసి జీడి బిక్షం,dwo జ్యోతి పద్మ ,మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ శారద, ప్రజా ప్రతినిధులు సిబ్బంది పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by Narra Paramesh

రక్తదానం చేసి మానవత్వం చాటుకున్న సారంగాపూర్ ఎంపిటిసి…

నయా నిజాం పాలన కొనసాగిస్తున్న కెసిఆర్ ను తరిమి కొట్టాలి_ బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే ఏలేటి