in , ,

మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ క‌విత‌, ఎంపీ సంతోష్ కుమార్ ల‌కు గోమ‌య ప్ర‌తిమ‌లు-అల్లోల దివ్యారెడ్డి

ktr

మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ క‌విత‌, ఎంపీ సంతోష్ కుమార్ కు గోమ‌య ప్ర‌తిమ‌ల‌ను అంద‌జేసిన అల్లోల దివ్యారెడ్డి

హైద‌రాబాద్, సెప్టెంబ‌ర్ 14: మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ క‌విత‌ ఎంపీ సంతోష్ కుమార్ ను సేవ్ దేశీ కౌస్ క్యాంపెనర్,  క్లిమామ్ వ్య‌వ‌స్థాప‌కురాలు అల్లోల దివ్యారెడ్డి  కలిసారు. ఈ సంద‌ర్భంగా వారికి  ఆమె గోమయ గణపతి ప్రతిమను అందజేశారు. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌లో భాగంగా ఎకో ప్రెండ్లీ గోమ‌య గ‌ణ‌ప‌తి ప్ర‌తిమ‌ల త‌యారీ-  పంపిణీ,  దేశవాళీ ఆవుల సంరక్షణ కోసం చేపట్టిన ప్రచార కార్యక్రమాలను వారికి  వివరించారు.

ప్ర‌జ‌ల‌కు ముఖ్యంగా చిన్న‌పిల్ల‌ల‌కు స్వ‌చ్చ‌మైన ఏ2 మిల్క్ ను అందించాల‌నే ఉద్దేశంతో పాటు హైబ్రిడ్ జాతులతో క్రాస్ బ్రీడింగ్ పద్ధతుల వల్ల దేశీయ పశుసంపద కనుమరుగైపోకుండా, వాటిని పరిరక్షించి, భవిష్యత్తు తరాలకు ఈ సంపాదనను అందించాల్సిన కర్తవ్యంతో ప‌ని చేస్తున్న‌ట్లు వారికి వివరించారు. దేశవాళీ ఆవుల సంరక్షణ కోసం దివ్యా రెడ్డి చేస్తున్న కృషిని  ఈ సంద‌ర్భంగా వారు అభినందించారు.

*గోమ‌య గ‌ణ‌ప‌తి*

పూర్వకాలం లో వినాయక చవితికి మనం స్వయంగా చిన్న చిన్న విగ్రహాలను మట్టితో లేక పవిత్రమయిన గోమయంతో చేసి, పదకొండు రోజులు భక్తి శ్రద్ధలతో పూజించుకుని నిమజ్జనం చేసేవాళ్ళం. ఇప్పుడు వినాయక చవితి అంటే పెద్ద పెద్ద ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు, వాటిని చెరువుల్లో నిమజ్జనం చేయడమే గుర్తొస్తుంది. ఆలా చేయడం వలన పర్యావరణానికి హాని కలిగించడమే కాకుండా, మన ముందు తరాలవారికి మన పండుగల యొక్క పవిత్రతను చెప్పలేకపోతున్నాము.

అంతరించిపోయిన గోమయ గణపతుల తయారీ కళని క్లిమోమ్ ద్వారా తిరిగి తీసుకువచ్చి 2016 నుంచి గత 8 సంవత్సరాలుగా  గోమయ గణపతులని చేసి ఐకేఆర్ ట్రస్ట్ ద్వారా  ఉచితంగా పంచుతున్నారు.  30 మంది కళాకారులు ఆరు నెల‌లుగా శ్ర‌మించి  క్లిమామ్ గోశాలలో ఈ గోమయ గణపతులను తయారు చేశారు. గోమయ గణపతులను తయారు చేయడానికి గోమయం, పసుపు, మట్టి, చింతగింజల మిశ్రమం, వేపాకు మిశ్రమం, ఎండు గడ్డి వంటి సహజమైన పదార్థాలనే ఉపయోగిస్తున్నారు. అందరు కూడా పర్యావరణహితంగా ప్రకృతికి ఎటువంటి హాని కలిగించని గోమయ లేదా మట్టి గణపతులనే వాడాలి అని అల్లోల దివ్యా రెడ్డి  పిలుపునిచ్చారు.

Indrakaran Reddy Allola

[zombify_post]

Report

What do you think?

Written by Srikanth

తస్మాత్ జాగ్రత్త!!!! మొబైల్ వినియోగదారులకు జిల్లా ఎస్పీ హెచ్చరిక

కోరుట్ల లో అంగన్వాడీ టీచర్ ల నిరసన