===సత్తుపల్లి కోర్టులో 660కేసులు పరిష్కారం
===జాతీయ లోక్ అదాలత్ లో జిల్లా 6వ అదనపు జడ్జీ వెంపటి అపర్ణ
సత్తుపల్లి నియోజకవర్గ కేంద్రంలోని శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో హృదయాలను కదిలించే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. సత్తుపల్లి లోని ఓ గ్రామానికి చెందిన భార్యాభర్తలకు కొన్నేళ్ల క్రితం వివాహమైంది. అయితే ఇరువురు మధ్య తరచూ గొడవపడగా కొంతకాలం క్రితం విసిగిపోయిన వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. కొన్ని రోజుల తరువాత రాజీ కొరకు జాతీయ లోక్ అదాలత్కు చేరింది. ఇలాగే మరోక భార్యాభర్తలు పరిస్థితి ఇదే. జిల్లా 6వ అదనపు జడ్జీ వెంపటి అపర్ణతో పాటు సీనియర్ సివిల్ జడ్జీ పీ.అరుణకుమారి, అదనపు సీనియర్ సివిల్ జడ్జీ ఆయేషా షరీన్, సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ గోపాలరావు సమక్షంలో జరిగిన లోక్ అదాలత్ ఈ దంపతులను కలిపి మళ్లీ ఒక్కటయ్యేలా చేసింది. ఈ సందర్భంగా ఆ ఇరువురు భావోద్వేగానికి గురయ్యారు. ఒకరినొకరు తమ తప్పులను తెలుసుకుని కలిసి ఉండేందుకు ఒప్పుకోవడంతో లోక్ అదాలత్ ఒక్కసారిగా చప్పట్లతో మార్మోగిపోయింది.
=== రాజీమార్గమే మేలు:
సత్తుపల్లి మండల న్యాయ సేవాధికార సంస్థ అధ్వర్యంలో నిర్వహించిన న్యాయవిజ్ఞాన సదస్సులో సుమారు 660కు పైగా సివిల్, క్రిమినల్, కాంపౌండేబుల్, చెక్ బౌన్స్, కుటుంబ సమస్యలు ఇతర అన్ని రకాల కేసులను రాజీమార్గంలో పరిష్కరించామన్నారు. 4వ ఏడీజే కోర్టులో రూ.15,90,000, సీనియర్ సివిల్ జడ్జీ కోర్టులో రూ.50,60,000 నగదు పరిష్కారం అయ్యాయి. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జీ కోర్టులో రూ.1,02,800, అడిషనల్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ అఫ్ క్లాస్లో రూ.6,00,000 నగదును రికవరీ చేశారు. 200పెట్టీ కేసులతో పాటు 4వ అదనపు కోర్టులో 2, సీనియర్ సివిల్ జడ్జీ కోర్టులో 4, ఈపీ 1, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జీ కోర్టులో 135, అదనపు జూనియర్ సివిల్ జడ్జీ కోర్టులో 317. ఒక బ్యాంక్ కేసుతో పాటు 2వ క్లాస్ కోర్టులో 200కేసులు మొత్తం కలిపి 660కేసులు రాజీకాబడినట్లు కోర్టు అధికారులు తెలిపారు. కేసులలో ఇరువర్గాల రాజీమార్గంలో లోక్ అదాలత్ కేసుల పరిష్కారానికి వేదిక నిలస్తుందని, రాజీమార్గమే మేలు అని న్యాయమూర్తులు అన్నారు. కోర్టుల చుట్టూ తిరిగి సమయం వృధా కాకుండా, ఆర్థిక నష్టం లేకుండా సత్వర పరిష్కారం లభిస్తుందని తెలిపారు. న్యాయవాదిని నియమించుకునే స్తోమత లేని వారికి న్యాయ సహాయం కోసం ఉచితంగా న్యాయవాదిని నియమిస్తామని, లోక్ అదాలత్ కార్యక్రమంలో సాధ్యమైన అన్ని కేసులు పరిష్కరించే దిశగా న్యాయవాదులు, పోలీసు అధికారులు సమన్యయంతో ప్రత్యేక చొర చూపాలని తెలిపారు. ఇరువర్గాల పరస్పర అంగీకరంతో కేసులు పరిష్కరించే విధంగా చూడాలని, వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో కల్లూరు ఏసీపీ బీ.రామానుజం, సిఐ జే.మోహనబాబు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పాలపాటి శ్రీనివాసరావు, న్యాయవాదులు, కక్షిదారులు, తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]

