in ,

భర్తను చంపింది రెండో భార్యే!

పాడేరు నియోజకవర్గం, అల్గూరి జిల్లా: గూడెంకొత్తవీధి మండలం సప్పర్ల గ్రామంలో భర్తను కర్రతో కొట్టి చంపిన భార్యను అరెస్టు చేసినట్లు చింతపల్లి అదనపు ఎస్పీ ప్రతాప్‌ శివ కిషోర్‌ తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను ఆదివారం తన కార్యాలయంలో వెల్లడించారు. సప్పర్ల గ్రామానికి చెందిన కొర్రా కృష్ణారావుకు 20 ఏళ్ల క్రితం నాగమణితో వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. నాగమణి రెండేళ్ల క్రితం చనిపోవడంతో అదే గ్రామానికి చెందిన ఒంటరిగా ఉంటున్న గెమ్మెలి ఈరమ్మను పెద్దల సమక్షంలో రెండో వివాహం చేసుకున్నాడు.మొదటి భార్య పిల్లలను ఈరమ్మ సరిగ్గా చూడకపోవడంతో వారిని వసతిగృహంలో చేర్పించాడు. భార్యపై అనుమానంతో కృష్ణారావు రోజూ ఆమెతో గొడవ పడేవాడు. దీంతో విసుగు చెందిన ఈరమ్మ అతడి అడ్డు తొలగించుకోవాలనుకుంది. గతనెల 30న ఇద్దరూ మరోసారి గొడవపడ్డారు. ఇంట్లోనున్న గొడ్డలి తీసుకొచ్చి భర్త తలపై మూడుసార్లు కొట్టింది. అతడికి తీవ్ర రక్తస్రావం కావడంతో పరారైంది. గ్రామస్థులు కృష్ణారావును ఆసుపత్రికి తరలించారు. 31న మృతి చెందాడు. పరారైన ఈరమ్మను గూడెంకొత్తవీధి సీఐ అశోక్‌కుమార్‌ ఈ నెల 2న రిమాండ్‌కు తరలించినట్లు అదనపు ఎస్పీ తెలిపారు. సీలేరు ఎస్సై రామకృష్ణ పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

ఎన్టీఆర్ జిల్లా నందిగామ

నిర్మించిన ఏడాది కే పగుళ్లు