in , , ,

బీఎస్పీ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మకు ఘన నివాళులు:

  • Bsp ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మకు ఘన నివాళులు

    కోదాడలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీర వనీత చాకలి ఐలమ్మ విగ్రహానికి బహుజన్ సమాజ్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్  పిల్లుట్ల శ్రీనివాస్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా శ్రీనివాస్ మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, పేద బతుకుల విముక్తి కోసం విరోచిత పోరాటం చేసి కుటుంబాన్ని కోల్పోతూ కూడా ఎంతో పోరాటం చేసిందని, అలాంటి వీర వనీత చాకలి ఐలమ్మ వారసులకు 115 అసెంబ్లీలలో ఒక్క సీటు కేటాయించలేదని కులాన్ని వృత్తి మాత్రమే పరిమితం చేయడం కోసం కుల పథకాలతో మభ్యపెడుతుందని తెలిపారు. 

ఉద్యమ సమయంలో తెలంగాణ తల్లి చిట్యాల ఐలమ్మగా కొనయాడి ఇప్పుడు జిల్లాకు పదివేల రూపాయల బడ్జెట్ కేటాయించి  తూతూమంత్రంగా జయంతులు నిర్వహిస్తున్నారని అన్నారు. దాదాపు 27 లక్షల జనాభా గల రజక కులాన్ని చిన్నచూపు చూస్తున్నారని వాపోయారు. బహుజన సమాజ్ పార్టీ బిసీలకు 70 సీట్లలో భాగంగా రజకులకు ఐదు నుంచి ఆరు సీట్లు కేటాయిస్తానని మాట ఇచ్చిన ఆర్.యస్. ప్రవీణ్ కుమార్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. 

ప్రతి పార్టీ ఓట్ల కోసమే ఆమె త్యాగాన్ని కొనియాడుతూ విగ్రహాలకు దండలేస్తున్నారే తప్ప రజకులకు ఎక్కడా ప్రాధాన్యత కలిపించడం లేదని, ఏన్నో చోట్ల బహిష్కరణలకు గురవుతున్నారని, యువతి, యువకులు సమాజంలో ఛీత్కారాలకు, అన్యాయాలకు, అత్యాచారాలకు బలవుతున్న ఎవరు పట్టించుకునేవారు లేరని వాపోయారు. 

ప్రతి ఒక్క తెలంగాణ అన్నా తమ్ముళ్లు,అక్కా చెల్లెళ్ళు ఆమె చేసిన పోరాటాలని స్ఫూర్తిగా తీసుకోని బహుజన రాజ్యం కోసం పోరాటం చేయాలని కోరారు. ఈ కార్యక్రమం లో జిల్లా ఉపాధ్యక్షులు పిడమర్తి.దశరద, జిల్లా EC మెంబర్ మాతంగి. ఏసుబాబు, జిల్లా మహిళ నాయకురాలు అంతోటి జ్యోతి, నియోజకవర్గ అధ్యక్షులు కంభంపాటి శ్రావణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి యరసాని కృష్ణ, కార్యదర్శి మరియు మోతె ఇంచార్జి కాంపాటి.వీరస్వామి, నియోజకవర్గ కార్యదర్శి మరియు మునగాల ఇంచార్జి కోటమన్మధుడు, చిలుకూరు మండల అధ్యక్షులు కొండా ఉపేందర్ గౌడ్, అనంతగిరి మండల అధ్యక్షులు నూకల గోపాలస్వామి యాదవ్, కోదాడ మండల అధ్యక్షులు మేరె యల్లారావు, కోదాడ పట్టణ అధ్యక్షులు షేక్ అజార్ బాబా, నియోజకవర్గ నాయకులు నెమ్మది సురేష్, పవన్, గద్దల వీరబాబు, చిట్టిబాబు, షేక్ ఖాసీం, వెంకటేష్, నవీన్, తదితరులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by Narra Paramesh

చాకలి ఐలమ్మ స్ఫూర్తితో మన సమస్యలపై ఉద్యమించాలి

చాకలి ఐలమ్మ స్ఫూర్తిని కొనసాగించాలి-ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి