బీఆర్ఎస్ కాంగ్రెస్, బిజెపి ప్రభుత్వాల దోపిడిని ఎండాకాట్టాలి – అయ్యా బాంచన్ అని అడిగే రోజులు పోయాయి
– బీఎస్పీ పార్టీ పెద్దపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ దాసరి ఉష
జూలపల్లి మండలంలో పర్యటించిన బిఎస్పి పార్టీ దాసరి ఉష , అయ్యా బాంచన్ అని అడిగే రోజులు పోయాయి అన్నారు. పెద్దపల్లి : జిల్లాలోని జూలపల్లి మండలం కాచాపూర్ గ్రామంలో 36వ రోజు మన ఊరు – మన ఉష కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి బిఎస్పీ పార్టీ పెద్దపల్లి నియోజకవర్గ ఇంచార్జి దాసరి ఉష, హాజరై గడపగడపకు ఏనుగు గుర్తును పరిచయం చేస్తూ, బీఆర్ఎస్ కాంగ్రెస్, బిజెపి ప్రభుత్వాల దోపిడిని ఎండాకాట్టాలని,అన్నారు ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటూ బీఎస్పి పార్టీ అధికారం లోకి వస్తే అందించే సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు, అలాగే నేడు కాచాపూర్ గ్రామం నుండి బహుజన్ సమాజ్ పార్టీలో చేరిన మహంకాళి రవి, మహంకాళి సత్తన్న, వడ్లూరి లక్ష్మణ్, అక్కపల్లి శేఖర్, మహంకాళి వెంకన్న, జేజేల రాకేష్, జల్లి అంజయ్య, మహంకాళి స్వామి, మహంకాళి సాది, మహంకాళి అంజయ్య తదితరులకి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధనంగా ఆహ్వానించారు.అనంతరం దాసరి ఉష మాట్లాడుతూ, కాచాపూర్ గ్రామం నుండి నేడు బహుజన్ సమాజ్ పార్టీలో చేరిన వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, కాచాపూర్ గ్రామంలో పూటకు తిండి లేక, ఉండడానికి ఇండ్లు లేని ఎన్నో కుటుంబాలు ఉన్నాయన్నారు, గ్రామ పరిధిలో వున్న సోలార్ ఇండస్ట్రీలో కనీసం స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా ఈ బీఆర్ఎస్ పాలన నడుస్తుందని అన్నారు, అయ్యా బాంచన్ అని అడిగే రోజులు పోయాయన్నారు బహుజనులు అధికార పీఠం వైపు ముందుకు వెళ్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో బిఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు తోట వెంకటేష్ పటేల్, పెద్దపల్లి నియోజకవర్గ కోశాధికారి ఎండి రియాజ్, నియోజకవర్గ మహిళా కన్వీనర్ ఆముదల అరుణ, నియోజకవర్గ కో కన్వీనర్ దేశబోయిన అఖిల, జూలపల్లి మండల అధ్యక్షులు సిపెళ్లి కొమురయ్య,మండల ఉపాధ్యక్షులు కథర్ల లక్ష్మణ్, మండల కోశాధికారి చిన్న మల్లేశం, కాల్వ శ్రీరాంపూర్ మండల అధ్యక్షులు కుమ్మరి సంపత్, మహేందర్, అనుష, శిరీష, నవ్య, స్వాతి, బివిఫ్ టీం, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు
[zombify_post]


