in

బిచ్చగాడు హీరో కుమార్తె ఆత్మహత్య

  • బిచ్చగాడు హీరో కుమార్తె ఆత్మహత్య

బిచ్చగాడు మూవీ హీరో కుమార్తె ఆత్మహత్య చేసుకుంది. నటుడు విజయ్‌ ఆంటోని కుమార్తె లారా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఒత్తిడి కారణంగా 12వ తరగతి చదువుతున్న లారా ఆత్మహత్యకు పాల్పడినట్లు తమిళనాడు ఆళ్వార్‌పేట పోలీసులు తెలిపారు.లారా ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

విజయ్ ఆంటోని కూతురు లారా చెన్నైలోని ఓ ప్రముఖ ప్రైవేట్ స్కూల్‌లో 12వ తరగతి చదువుతోంది. చెన్నైలోని డీడీకే రోడ్‌లోని తన ఇంట్లో సెప్టెంబర్ 19వ తేదీ తెల్లవారుజామున లారా ఉరి వేసుకుని కనిపించినట్లు సమాచారం. దీంతో ఆమెను వెంటనే చెన్నై ఆళ్వార్‌పేటలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. లారా మరణ వార్త విని సినీ ప్రముఖులు, లారా స్నేహితులు సంతాపాన్ని ప్రకటించారు. 

విజయ్ ఆంటోనికి 2006 పెళ్లయింది. ఫాతిమా అనే మహిళను ఆయన వివాహం చేసుకున్నాడు. వీరికి కుమార్తె లారా, కుమారుడు ఉన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by Khuddus

From Nadigama Assembly

బీఆర్ ఎస్ లో చేరిన విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు

వినికిడి యంత్రాలను పంపిణీ