in ,

బిగ్ బ్రేకింగ్ : రేపు ఏపీ బంద్.. చంద్రబాబు రిమాండ్ కు నిరసనగా టీడీపీ కీలక నిర్ణయం

తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. స్కిల్ డెలప్మెంట్ స్కామ్ కేసులో పార్టీ అధినేత చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధించడంతో రేపు ఏపీ బంద్‌కు టీడీపీ పిలుపునిచ్చింది. చంద్రబాబును జైలుకు పంపాడానికి నిరసనగా ఈ బంద్‌కు పిలుపునిచ్చినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. రేపు ఏపీ బంద్‌ను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులను అధిష్టానం ఆదేశించింది. కాగా, స్కిల్ డెలప్మెంట్ స్కామ్ కేసులో 14 రోజుల రిమాండ్ విధిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు టీడీపీ చీఫ్ చంద్రబాబుకు బిగ్ షాకిచ్చిన విషయం తెలిసిందే. కోర్టు తీర్పు నేపథ్యంలో చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by RAJESH POTLA

చంద్రబాబు అరెస్టుపై భగ్గుమన్న టీడీపీ శ్రేణులు

టీడీపీ పిలుపు*,రేపు ఏపీ బంద్