ఘంటసాల – తాడేపల్లి :టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయడం ఓ వ్యక్తి ప్రాణాలను తీసింది.
చంద్రబాబు అరెస్ట్ గురించి తెలుసుకున్న కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గం ఘంటసాల మండలం, తాడేపల్లి గ్రామానికి చెందిన కొడాలి సుధాకర రావు (సుధ ) (60) అనే అభిమాని గుండెపోటుతో మృతిచెందాడు.
1983లో టీడీపీ ఆవిర్భావం నుంచి నేటి వరకు టీడీపీ కార్యకర్తగా కొనసాగుతున్నాడు.
మేకలు మేపుకుంటూ జీవనం సాగిస్తున్న సుధ ఆకస్మిక మరణంతో కుటుంబ పెద్దను కోల్పోవడంతో కుటుంబ సభ్యులు ఏడుస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టిస్తుంది.
మృతుడు సుధకు భార్య చంటి, కుమారుడు సుబ్రహ్మణ్యం, కుమార్తె రాణి ఉన్నారు.
విషయం తెలుసుకున్న టీడీపీ మండల అధ్యక్షుడు తుమ్మల చౌదరి బాబు, గ్రామ పార్టీ అధ్యక్షుడు యార్లగడ్డ వీరభద్రరావు, టీడీపీ నేతలు పరుచూరి సుభాష్ చంద్రబోస్, నీటి సంఘం మాజీ అధ్యక్షుడు సూరపనేని ప్రసాద్, మొవ్వ బాసి, తుమ్మల రత్నగిరి దిరిశం వెంకట్రావు సంతాపం తెలియజేశారు…
[zombify_post]


