డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా:
మల్కీపురంలో బాలబాలికల్లో క్రీడోత్సాహం వెల్లువిరిసింది. వివరాలలోకెళ్ళితే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమజిల్లా రాజోలు నియోజకవర్గం మల్కీపురంలో షటిల్ ఛాంపియన్షిప్ అండర్ 11 బాలబాలికల టోర్నమెంట్ ను జిల్లా కలక్టర్ హిమాన్షు శుక్లా, రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజోలు ఎమ్మెల్యే రాపాక మాట్లాడుతూ క్రీడలు విద్యార్థులకు మానసిక ఉల్లాసాన్ని కల్గిస్తాయన్నారు. మల్కీపురం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంద్రప్రదేశ్ ఈస్ట్ గోదావరి బ్యాట్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి అండర్ 11 బాలబాలికల షటిల్ టోర్నమెంట్ ప్రముఖుల సమక్షంలో చాలా అట్టహాసంగా ప్రారంభమైయింది. ఈ మేరకు కలక్టర్ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా విద్యార్థుల్లో క్రీడోత్సాహాన్ని కల్గిస్తున్నా అసోసియేషన్ సభ్యులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులతో పాటుగా గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
[zombify_post]


